: మాకు ఫుడ్ పెట్టిందే డబ్బింగ్ కళ!: హీరో ఆది


‘మా కుటుంబానికి ఫుడ్ పెట్టింది డబ్బింగ్ కళే. డబ్బింగ్ చెప్పడమనేది నాకు కూడా ఎంతో ఇష్టం’ అని హీరో ఆది అన్నాడు. మొదటి సినిమాలోనే హీరోగా పరిచయమయ్యానని, ప్రేక్షకులు కూడా తనను హీరోగా ఆమోదించారని, అందుకే, డబ్బింగ్ గురించిన ఆలోచన తాను చేయలేదని అన్నాడు. ‘నా మొదటి చిత్రంలో నేను డబ్బింగ్ ఎలా చెబుతానోనని మా నాన్న మొదటి నుంచి టెన్షన్ పడేవారు. ‘డబ్బింగ్ అంటే అంత ఈజీ అనుకున్నావా? మొదటి సినిమాలో నీ క్యారెక్టర్ కైనా డబ్బింగ్ చెబుతావా?’ అని మా నాన్న అనేవారు. మొత్తానికి ఎంజాయ్ చేస్తూ మొదటి సినిమాలో నా డబ్బింగ్ చెప్పేశాను’ అంటూ తన మొదటి చిత్రం జ్ఞాపకాలను హీరో ఆది గుర్తు చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News