: వైఎస్సార్సీపీ రెచ్చగొడుతోంది... ఎవరూ ఆవేశానికి లోనుకావద్దు: టీడీపీ నేత నారా లోకేశ్
ఎవరూ ఆవేశానికి లోనుకావద్దని టీడీపీ నేత నారా లోకేశ్ తమ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు తన ట్విట్టర్ లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు. టీడీపీ శ్రేణులను వైఎస్సార్సీపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని.. అనంతపురంలో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యతిరేకని ఆరోపించారు. మన శక్తియుక్తులన్నిటినీ రాష్ట్ర అభివృద్ధి కోసమే వినియోగిద్దామని లోకేశ్ సూచించారు. కాగా, చెప్పులంటే టీడీపీ నేతలు ఫీలవుతున్నారు, అందుకని చెప్పుల బదులు చీపుర్లు చూపించండి, అప్పుడైనా సిగ్గొచ్చి వారిచ్చిన హామీలను నెరవేస్తారంటూ వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితాజాగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నారా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా టీడీపీ శ్రేణులకు తన సందేశాన్ని పంపారు.