: సచివాలయం రెడీ కాకపోయినా ఉద్యోగులు వెళ్లాల్సిందే: చంద్రబాబు ఆదేశంతో ఉద్యోగుల్లో మళ్లీ ఆందోళన


వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం సిద్ధమైనా, కాకున్నా ఈ నెల 27కు ఉద్యోగులంతా తరలి వెళ్లాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా ఆదేశించడంతో, ఉద్యోగుల తరలింపు విషయమై మరింత గందరగోళ పరిస్థితి నెలకొంది. రెండు రోజుల క్రితం చీఫ్ సెక్రటరీ టక్కర్ మాట్లాడుతూ, తొలుత వివిధ విభాగాల అధిపతులు మాత్రమే వెళతారని చెప్పడంతో తాము కొంత ఉపశమనాన్ని పొందినట్టేనని ఉద్యోగులు భావించారు. తాజాగా ముఖ్యమంత్రి ఆదేశాలతో మళ్లీ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. కార్యాలయాలు సిద్ధం కాకుండా తామెళ్లి ఎక్కడ కూర్చోవాలన్నది ఉద్యోగుల మొదటి ప్రశ్న కాగా, అక్కడ అద్దెలు, భవనాల వసతి, మౌలిక సదుపాయాలు, పిల్లల స్కూళ్లు తదితరాల విషయంలోనూ ప్రశ్నలను సంధిస్తున్నారు. ఇక అన్ని విభాగాల అధిపతులు, వారి ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు వెళితే, వారి వెనుకే ఉద్యోగులు సైతం తరలి వస్తారని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. కాగా, నిన్నటి భారీ వర్షాలతో వెలగపూడిలో నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News