: కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీ షోకాజ్ నోటీసులు
త్వరలో టీఆర్ఎస్ లోకి చేరనున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పీసీసీ అధ్యక్ష హోదాలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నోటీసులు జారీ చేస్తూ, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గత కొంతకాలంగా కాంగ్రెస్ కార్యక్రమాల్లో కనిపించని ఆయన, నిన్న మీడియా ముందుకు వచ్చి ఉత్తమ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. పొన్నాల లక్ష్మయ్య కన్నా అసమర్ధుడిగా ఉత్తమ్ కనిపిస్తున్నారని కోమటిరెడ్డి దుయ్యబట్టారు. తాను అదే హోదాలో ఉంటే వరుస ఓటములకు బాధ్యత వహించి రాజీనామా చేసి ఉండేవాడినని కూడా వ్యాఖ్యానించారు.