: అసెంబ్లీ సీట్లు పెంచితే మనకు లాభం ఉండదు: అమిత్ షాకు తెలంగాణ బీజేపీ నివేదిక!


తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను ఇప్పట్లో పెంచవద్దని, పెంచితే బీజేపీకి లాభం ఉండదని ఆ పార్టీ నేతలు అధిష్ఠానానికి ఓ రిపోర్టును పంపినట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే, బీజేపీ బలం ఏ మేరకు పెరుగుతుందన్న విషయమై నివేదికను ఇవ్వాలని అమిత్ షా ఆదేశించగా, దీనిపై తర్జనభర్జనల మధ్య నివేదికను బీజేపీ రాష్ట్ర కమిటీ తయారు చేసిందట. పలు పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరికలు అధికంగా ఉన్నాయని, పెరిగే సీట్లను వారికి తాయిలాలుగా చూపుతోందని ఆరోపించిన బీజేపీ నేతలు, తన అధికార బలంతో టీఆర్ఎస్ వీటిని కైవసం చేసుకుంటుందే తప్ప, బీజేపీకి లాభముండదని సూచించినట్టు సమాచారం. ఫిరాయింపుదారులకు, పార్టీలో అసంతృప్తులుగా ఉన్న వారికి ఈ సీట్లను టీఆర్ఎస్ పంచుతుందని, అసెంబ్లీల పెంపు బీజేపీకి కలిసిరాదని వారు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News