: కిడ్నీ రాకెట్ లో అపోలో గ్రూప్... ఐదు ఆసుపత్రులకు నోటీసులు


ఢిల్లీలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసుల దర్యాఫ్తు ముమ్మరం అయింది. కేసులో అపోలో గ్రూప్ నిర్వహిస్తున్న ఆసుపత్రుల హస్తం ఉందన్న వార్తలు సంచలనం కలిగించగా, నేడు ఐదు ఆసుపత్రుల మేనేజ్ మెంట్ కు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేసు విచారణకు రావాలని ఆసుపత్రుల విభాగ అధిపతులకు ఈ నోటీసులు ఇచ్చినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కేసును సాధ్యమైనంత త్వరగా విచారించి, నిందితులను గుర్తించి కేసులు పెట్టనున్నట్టు వారు తెలిపారు. అపోలో హాస్పిటల్స్ లో కిడ్నీల అమ్మకాలు జరుగుతున్నాయని గతంలోనూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజా నోటీసులపై స్పందించేందుకు అపోలో యాజమాన్యం నిరాకరించింది. మీడియాకు తామే ఓ ప్రకటన విడుదల చేస్తామని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News