: రూ. 250 కోట్ల బడ్జెట్ తో హీరో సూర్య భారీ చిత్రం


ఎల్లప్పుడూ కొత్త ప్రయోగాలు చేసేందుకు ఉత్సాహం చూపే తమిళ స్టార్ సూర్య, మరో భారీ ప్రయోగానికి పూనుకున్నాడు. ప్రస్తుతం సింగం 3లో నటిస్తున్న ఆయన, తదుపరి సుందర్ సీ డైరెక్షన్ లో భారీ చిత్రాన్ని చేసేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్టుతో తీయనున్నారని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాణ సంస్థ శ్రీ తెండ్రల్ ఫిలింస్ తన 100వ చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తోందని, ప్రముఖ దర్శకుడు సుందర్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News