: మంత్రి పల్లె వాహనాన్ని నాశనం చేసిన వైకాపా కార్యకర్తలు
వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న రైతు భరోసా యాత్ర ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగుతోంది. యాత్రను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు అనంతపురం జిల్లా ఒడిసిలో రోడ్డుపై బైఠాయించగా, వారిని వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్యా ఘర్షణ జరుగగా, నలుగురు వైకాపా కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆగ్రహంతో మంత్రి పల్లె రఘురాథరెడ్డికి చెందిన వాహనాన్ని వైకాపా వర్గీయులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.