: జగన్ యాత్రను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ అనుచరులు... చెప్పుల వర్షంతో తీవ్ర ఉద్రిక్తత
అనంతపురం జిల్లా కదిరిలో జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్రలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఉదయం ఆయన కదిరిలో పర్యటిస్తుండగా, మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం నేత వెంకటప్రసాద్ అనుచరులు, ర్యాలీపై చెప్పుల వర్షం కురిపించారు. జగన్ కాన్వాయ్ ని వారు అడ్డుకున్నారు. దీంతో తెలుగుదేశం, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తగా, పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలనూ చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. జగన్ యాత్రను జరగనివ్వబోమని, ఎక్కడికక్కడ అడ్డుకుంటామని తెలుగుదేశం కార్యకర్తలు చెబుతుండగా, తమ నేతకు అడ్డుపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వైకాపా కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.