: ముంబై, పుణె ఎక్స్ ప్రెస్ వేపై ఘోరం... లగ్జరీ బస్సు అదుపు తప్పి 17 మంది మృతి


ముంబై - పుణె ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఓ లగ్జరీ బస్సు, మరో కారు ఢీకొనడంతో బస్సు 20 అడుగుల లోతైన కాలువ లోకి పడిపోగా, 17 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 33 మందికి తీవ్రగాయాలు కాగా, వారిని పాన్వెల్ లోని పనాసియా ఆసుపత్రికి తరలించారు. నిఖిల్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఉదయం 5 గంటల ప్రాంతంలో రాయగఢ్ జిల్లా శివఖార్ ప్రాంతంలో ఘటన జరుగగా, విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరణించిన వారిలో 10 మంది మహిళలు, ఆరుగురు పురుషులు, ఎనిమిది నెలల చిన్నారి ఉన్నారు. ఈ బస్సు సతారా నుంచి ముంబైకి వెళుతోంది. ప్రమాదానికి ముందు బస్సు ఓ స్విఫ్ట్ కారును, మరో ఇన్నోవానూ ఢీకొని కాలువలోకి జారినట్టు పోలీసులు వివరించారు.

  • Loading...

More Telugu News