: లంచగొండి అధికారుల కుటుంబసభ్యులూ నేరస్తులే: భార్య, కుమారుడు, కోడలికి జైలుశిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు సంచలన తీర్పు


అవినీతికి పాల్పడిన అధికారి మాత్రమే కాదు. ఆయన అవినీతిని ఆపలేకపోయిన కుటుంబ సభ్యులు కూడా నేరస్తులే నంటూ జబల్ పూర్ సీబీఐ కోర్టు సంచలన తీర్పిచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న సూర్యకాంత్ గౌర్, రూ. 94 లక్షల ప్రభుత్వ నిధులను కాజేశారన్న ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయమూర్తి యోగేష్ చంద్ర గుప్తా, సూర్యకాంత్ తో పాటు ఆయన భార్య వనితా గౌర్, కుమారుడు శిశిర్ గౌర్, కోడలు సునీతా గౌర్ లకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 2.5 లక్షల చొప్పున జరిమానా విధించారు. జూలై 14, 2010లో సీబీఐ అధికారులు గౌర్ ఇంటిపై దాడులు చేసి ఆదాయానికి మించి ఆస్తులున్నాయని కేసు పెట్టారు. ప్రభుత్వ నిధులను తన ఖాతాలకు తరలించుకున్నాడని పక్కా సాక్ష్యాలు ఉండటంతో కోర్టు ఆయనతో పాటు కుటుంబమంతటికీ శిక్షను విధించింది. కాగా, ఇంటిల్లిపాదీ జైలుకు వెళ్లడంతో, వారి విజ్ఞప్తి మేరకు శిశిర్ గౌర్ ఐదేళ్ల కుమారుడిని సైతం అధికారులు జైలుకు తరలించారు.

  • Loading...

More Telugu News