: మద్యం మాన్పిస్తే ప్రజలు పిచ్చోళ్లవుతారు!: నోరుజారి సర్దుకున్న చంద్రబాబు
ప్రజలను మద్యం తాగే అలవాటు నుంచి మాన్పించాలని చూస్తే, వారికి పిచ్చి పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వెంటనే సర్దుకుని వారిని దశలవారీగా తాగుడుకు దూరం చేయాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. నవనిర్మాణ వారోత్సవాల్లో భాగంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బెల్టు షాపులు ఎన్నింటిని తొలగించినా, కొత్తవి పుడుతూనే ఉన్నాయని డ్వాక్రా సభ్యులు గుర్తు చేయగా, బెల్టు షాపులపై కఠినంగా వ్యవహరిస్తున్నామని, మద్య నిషేధం ఇప్పట్లో సాధ్యం కాదని చంద్రబాబు అన్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన వారు, పిల్లలు వద్దని భావిస్తున్న కారణంగా రాష్ట్రంలో జనాభా తగ్గుతోందని, ఇదే కొనసాగితే, రాష్ట్రంలో రోబోలతో పని చేయించుకోవాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.