: ఇంట్లో టాయ్ లెట్ ఉంటేనే అక్కడ తుపాకీ లైసెన్స్ ఇస్తారు!


ఎవరికైనా ఇతరుల నుంచి ప్రాణహాని ఉన్నప్పుడు ఆత్మరక్షణ కోసం తుపాకీ లైసెన్సులు తీసుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మధ్యప్రదేశ్ లో మాత్రం పరువు ప్రతిష్ఠల కోసం తుపాకీ లైసెన్సులు తీసుకుంటారట. అక్కడి రాయ్ గఢ్ జిల్లాలో మాత్రం ఇందుకు భిన్నంగా, తుపాకీ లైసెన్స్ కావాలంటే మాత్రం తమ ఇంట్లో టాయ్ లెట్ ఉందన్న ఆధారం చూపించాలి. తుపాకీ లైసెన్స్ తీసుకోవాలంటే సుమారు 50 వేల రూపాయలు ఖర్చు అవుతాయి. తుపాకి లైసెన్స్ కోసం ఇంత ఖర్చు చేయగలిగిన వ్యక్తికి, ఇంట్లో టాయిలెట్ కట్టించే ఆర్థిక స్తోమత ఉంటుందని, అందుకే ఈ నిబంధనను పెట్టామని ఆ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ విధంగా స్వచ్ఛభారత్ కోసం కూడా అధికారులు పాటుపడడం విశేషం.

  • Loading...

More Telugu News