: 'సన్నాఫ్ సత్యమూర్తి' రిలీజ్ అప్పుడు త్రివిక్రమ్ ప్రామిస్ చేశారు...ఇప్పుడు హిట్ ఇచ్చారు!: సమంత
'సన్నాఫ్ సత్యమూర్తి' విడుదలైన రోజున రివ్యూలన్నీ మిశ్రమ స్పందనతో రావడంతో, ఇంత కష్టపడి తీస్తే ఇలా రాశారేంటా? అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బాధపడ్డారని సమంత తెలిపింది. "అప్పుడే ఆయన అన్నారు, దీనికంటే గొప్ప సినిమా తీస్తా'నని కసిగా ప్రామిస్ అన్నారు. ఆ రోజు అన్నట్టే ఈ రోజు తెలుగు సినీ పరిశ్రమకు సూపర్ హిట్ ఇచ్చారు" అని సమంత. 'అ ఆ' సినిమాను అంతా అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఇంత పెద్ద విజయం అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. ఈ సినిమా కోసం తెరపై తామంతా కష్టపడితే, తెరవెనుక చాలా మంది కష్టపడ్డారని, వారంతా ఈ విజయానికి కారకులని పేర్కొంది.