: మీడియా డబుల్ స్టాండర్డ్స్ కి బలయ్యాను: గేల్ ఆవేదన


మీడియా డబుల్ స్టాండర్డ్స్ తో తనను డిఫేమ్ చేసిందని వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ పేర్కొన్నాడు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గేల్ మాట్లాడుతూ, డబుల్ స్టాండర్డ్స్ తో తనను బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ సందర్భంగా ఓ మహిళా రిపోర్టర్ ను అభ్యంతరకరంగా పార్టీకి ఆహ్వానించడం, ఐపీఎల్ సందర్భంగా బ్రిటిష్ మహిళా జర్నలిస్టుతో 'బిగ్ బ్యాట్' వ్యాఖ్యలతో వివాదం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు మీడియా తనను ఎద్దేవా చేసిందని అన్నాడు. తరువాత తనపై వరుస కథనాలతో బలిపశువును చేసేందుకు ప్రయత్నించిందని తెలిపాడు. అయితే ఆ వార్తలు విండీస్ బోర్డును ప్రభావితం చేయడంతో తాను బలయ్యానని, అయినప్పటికీ వాటికి తానేమాత్రం ప్రభావితం కాలేదని తెలిపాడు. కొంచెం కూడా తగ్గకుండా స్ట్రాంగ్ గా నిలబడ్డానని గేల్ తెలిపాడు.

  • Loading...

More Telugu News