: దూలపల్లి కెమికల్ గోడౌన్ లో అగ్నిప్రమాదం...ఎగసిపడుతున్న మంటలు


హైదరాబాదులోని జీడిమెట్ల సమీపంలోని దూలపల్లిలోని ఓ కెమికల్ గోడౌన్ లో పేలుడు సంభవించింది. దీంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నిస్తుండగా, వారికి అగ్నిమాపక సిబ్బంది తోడయ్యారు. అయితే మంటలు పెద్దఎత్తున ఎగసిపడుతుండడంతో స్థానికులను అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆ రహదారి మీదుగా వాహనాలు వెళ్లకుండా అధికారులు నిలిపేశారు.

  • Loading...

More Telugu News