: ఢిల్లీలో ఫిర్యాదు చేయడానికి సిద్ధమవడం భావ్యం కాదు: దేవినేని
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోన్న సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి హరీశ్‌రావు ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరావు స్పందించారు. ఈరోజు విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. హరీశ్ రావు తమ ప్రభుత్వం పట్ల చేస్తోన్న వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కృష్ణా రివర్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందని హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వమే కృష్ణా రివర్ బోర్డ్ ఆదేశాలను పాటించడం లేదని అన్నారు. విభజన చట్టం ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం ముందు కెళ్లాలని ఆయన సూచించారు. విభజన చట్టం ప్రకారమే రాష్ట్రం విడిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ తమపై ఢిల్లీలో ఫిర్యాదు చేయడానికి సిద్ధమవడం భావ్యం కాదని ఆయన అన్నారు.