: టీకాంగ్ ను ప్రక్షాళన చేయకపోతే ఇక పోస్టుమార్టమే: కోమటిరెడ్డి


తెలంగాణ కాంగ్రెస్ ను ప్రక్షాళన చేయకపోతే ఇక ఆ పార్టీ పోస్టుమార్టంకే మిగులుతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా పొన్నాల లక్ష్మయ్యను మించిన అసమర్ధుడు కొనసాగుతున్నారని మండిపడ్డారు. వరుస ఓటములకు బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను పీసీసీ చీఫ్ గా ఉండి ఉంటే పదవికి రాజీనామా చేసేవాడినని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై సోనియా గాంధీకి లేఖ రాస్తానని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరో ఇప్పుడే ప్రకటించాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. పార్టీలోని ఓ 15 నుంచి 20 మంది సీనియర్ నేతలు తామే సీఎం అభ్యర్థి అని కలలు కంటున్నారని, వాటికి చెక్ చెప్పాలంటే ఇప్పుడే పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించాలని ఆయన సూచించారు. తెలంగాణ కోసం పోరాడిన నేతలకే పీసీసీ పగ్గాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News