: ఉత్తరాఖండ్ హైడ్రామాను గుర్తు చేసిన వైవీ సుబ్బారెడ్డి!... ‘జంపింగ్’లపై అనర్హత తప్పదని జోస్యం!


ఏపీలో ఇటీవలే కండువాలు మార్చేసిన ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్తుపై వైసీపీ నేత, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి... ఉత్తరాఖండ్ లో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ హైడ్రామాను ప్రస్తావించారు. ఉత్తరాఖండ్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ హరీశ్ రావత్ సర్కారును కూల్చేందుకు జెండాలు మార్చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసిన వైనాన్ని ఆయన ప్రస్తావించారు. ఉత్తరాఖండ్ లో మాదిరిగానే ఏపీలోనూ వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమేనని ఆయన జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News