: ట్రంప్ ఆలోచనా విధానం దేశానికి ప్రమాదకరం... అలాంటి వ్యక్తి చేతిలో న్యూక్లియర్ కోడ్ పెట్టలేం!: హిల్లరీ విమర్శలు
అమెరికా అధ్యక్ష బరిలో రిపబ్లికన్ అభ్యర్థిగా నిలబడనున్న డొనాల్డ్ ట్రంప్ పై డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. డొనాల్డ్ ట్రంప్ తో దేశానికి తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. పుతిన్ లాంటి నియంతను ట్రంప్ ప్రశంసించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ట్రంప్ ఆలోచనా విధానం దేశానికి ప్రమాదకరమని ఆమె చెప్పారు. వ్యక్తిగత కక్ష సాధింపుల కోసం ట్రంప్ అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడికి ఉండాల్సిన పరిజ్ఞానం ఆయనకు లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ట్రంప్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె తెలిపారు. ట్రంప్ లాంటి వ్యక్తిని నమ్మి, ఆయన చేతిలో అమెరికా న్యూక్లియర్ కోడ్ ను పెట్టలేమని ఆమె స్పష్టం చేశారు. ట్రంప్ అభిప్రాయాలు ప్రగతికి ప్రతిబంధకాలుగా ఉన్నాయని ఆమె తెలిపారు. అధ్యక్ష స్ధానాన్ని అలంకరించేందుకు ట్రంప్ సరైన వ్యక్తి కాదని ఆమె స్పష్టం చేశారు.