: అటు టీఆర్ఎస్ ఆవిర్భావ సభ.. ఇటు బాబు పాదయాత్ర ముగింపు సభ


రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే రెండు కీలక ఘట్టాలు మరికాసేపట్లో ఆరంభం కానున్నాయి. ఒకటి చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభ కాగా, మరోటి టీఆర్ఎస్ ఆవిర్భావ సభ. ఏడు నెలలుగా 2817 కిలోమీటర్లపాటు అవిశ్రాంతంగా నడక సాగించి ప్రజల కష్టనష్టాలతో మమేకం అయిన బాబు.. తన 'వస్తున్నా.. మీకోసం' యాత్రను విశాఖలో చరమగీతం పాడనున్నారు. అనారోగ్య సమస్యలు చుట్టుముట్టినా, రాజకీయ వైరి పక్షాలు విమర్శల జడివాన కురిపించినా చలించని ఆ 63 ఏళ్ళ అలుపెరుగని యోధుణ్ణి చూసేందుకు, ఆయన చెప్పే పాదయాత్ర అనుభవాల సారం వినేందుకు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు విశాఖకు పయనమయ్యాయి.

ఇక తెలంగాణ వాదంపై తమకే పేటెంట్ ఉన్నట్టు వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భవించి దశాబ్దంపైబడింది. 2001లో మంత్రి పదవి ఇవ్వలేదని బాబుపై అలకబూనిన కేసీఆర్ మనసులో పుట్టిన ఆలోచన సరిగ్గా ఇదే రోజున టీఆర్ఎస్ పేరిట కార్యరూపం దాల్చింది. ఈసందర్భాన్ని పురస్కరించుకుని నేడు ఆర్మూర్ లో టీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో కేసీఆర్ నోట పలు వాడివేడి వ్యాఖ్యలు బయటికొస్తాయని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

  • Loading...

More Telugu News