: ఓపక్క ఒబామా మీటింగ్... మరోపక్క కంగారు పెట్టిన విమానం!


అమెరికాలోని కొలరాడోలో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తున్న సమయంలో, పీటర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ కు చెందిన తేలికపాటి యుద్ధ విమానం ఒకటి పైనుంచి తక్కువ ఎత్తులో ఎగురుతూ వెళ్లి కూలిపోయింది. దీంతో అక్కడున్న వారు, భద్రతా సిబ్బంది ఆందోళన చెందారు. ఎఫ్ 16 థండర్ బర్డ్ గా పేర్కొనే ఈ విమానం పైలట్ స్వల్పగాయాలతో బయటపడడం విశేషం. కాగా, కార్యక్రమం తరువాత వాషింగ్టన్ వెళ్లాల్సిన ఒబామా, ముందుగా గాయపడిన పైలట్ ను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆ పైలట్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు.

  • Loading...

More Telugu News