: పరిటాల రవికి భయపడి బెంగళూరు పారిపోయిన జేసీ దివాకర్ రెడ్డిని అనుకుంటున్నారా?: వైకాపా నేత అనంత వెంకట్రామిరెడ్డి
తెలుగుదేశం పార్టీ నేతల బెదిరింపు రాజకీయాలకు భయపడే వ్యక్తులం కాదని వైకాపా నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అనంతపురంలో పరిటాల రవికి భయపడి బెంగళూరుకు పారిపోయిన జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిలకు ఉన్న చరిత్ర తమకు లేదని నిప్పులు చెరిగారు. తమకు అధికారం ఉన్నా, లేకపోయినా, ప్రజలతో మమేకమై ఉంటామని స్పష్టం చేశారు. పదవులు, డబ్బు, కాంట్రాక్టు పనులు తమకు అక్కర్లేదని అన్నారు. తాము ఎన్నడూ ఎవరికీ భయపడలేదని, భవిష్యత్తులో భయపడబోమని తెలిపారు.