: ‘రేషన్’ వినియోగదారులకు చంద్రబాబు నుంచి ఫోన్ కాల్!
రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, సకాలంలో రేషన్ తీసుకునేందుకు వీలుగా ఏపీలో రేషన్ వినియోగదారులను ఫోన్ మెస్సేజ్ ల ద్వారా అప్రమత్తం చేస్తోంది. దీంతో, అటు వినియోగదారులు, ఇటు రేషన్ డీలర్ పారదర్శకంగా వ్యవహరించేందుకు అవకాశముంటుంది. ‘మీకు రావాల్సిన సరుకులు మీ రేషన్ షాపునకు చేరాయి. మీరు వచ్చి రేషన్ తీసుకోవచ్చు’ అనే ఎస్సెమ్మెస్ వినియోగదారుడి సెల్ ఫోన్ కు చేరుతుంది. ఆ తర్వాత, ‘ఈ నెలలో మీరు రేషన్ సరుకులు తీసుకున్నారు సంతోషం. ధన్యవాదాలు’ అని సీఎం చంద్రబాబు రికార్డెడ్ వాయిస్ వినిపిస్తుంది. సదరు వినియోగదారుడు రేషన్ సరుకులు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ తీసుకోని పక్షంలో తన రేషన్ దుర్వినియోగమైందనే విషయాన్ని గ్రహించి, డీలర్ ను నిలదీసే అవకాశం ఉంటుంది. కాగా, చంద్రబాబు రికార్డెడ్ కాల్ వాయిస్ విధానం త్వరలోనే రేషన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.