: బ్రిటన్ దుష్టదేశం, అమెరికా బడా సైతాన్: సంచలన వ్యాఖ్యలు చేసిన ఇరాన్ అధ్యక్షుడు


బ్రిటన్ దుష్ట దేశమని, అమెరికా బడా సైతాన్ అని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖొమైనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానెల్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, 1979 ఇస్లామిక్ విప్లవం తరువాత అమెరికా తమతో శత్రుత్వం ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. ప్రాంతీయ అంశాలపై ఆ దేశాలతో సహకరించే ప్రశ్నేలేదని ఆయన తేల్చిచెప్పారు. దుష్ట దేశమైన బ్రిటన్, బడా సైతాన్ అమెరికాలను నమ్మడం మహాతప్పు అని ఆయన పేర్కొన్నారు. ఆ రెండు దేశాల లక్ష్యాలు ఇరాన్ కు 180 డిగ్రీలు వ్యతిరేకమని ఆయన చెప్పారు. 2015లో ఇరాన్, మరి ఆరు దేశాలు కుదుర్చుకున్న అణుఒప్పందానికి అమెరికా కట్టుబడి ఉండడం లేదని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News