: రాజ్యసభ విజేతలకు స్వాగతం పలికిన మండలి చైర్మన్, ప్రత్యేక విందు


ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన రైల్వే మంత్రి సురేష్ ప్రభు, తెలుగుదేశం నేతలు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ లు ఈ మధ్యాహ్నం అసెంబ్లీకి రాగా, మండలి చైర్మన్ చక్రపాణి స్వయంగా స్వాగతం పలికారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత, పోటీలో ఎవరూ లేకపోవడంతో వీరు ముగ్గురితో పాటు వైకాపా నేత విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్న ప్రకటన వెలువడగా, శాసనసభా ప్రాంగణానికి చేరుకున్న కొత్త ఎంపీలకు ఘన స్వాగతం లభించింది. వీరి గౌరవార్థం చక్రపాణి ప్రత్యేక విందును ఏర్పాటు చేయగా, ముగ్గురూ పాల్గొన్నారు. విజయసాయిరెడ్డి మాత్రం విందుకు హాజరు కాలేదు. మరికాసేపట్లో వీరు శాసనసభా కార్యదర్శి నుంచి ధ్రువపత్రాలు అందుకోనున్నారు.

  • Loading...

More Telugu News