: 'ఓటుకు నోటు' కేసులో మత్తయ్యకు ఊరట... కేసు కొట్టేసిన హైకోర్టు


గత సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన 'ఓటుకు నోటు' కేసులో నిందితుడు మత్తయ్యకు హైకోర్టు నుంచి ఊరట లభించింది. ఈ కేసులో మత్తయ్యను నిందితుడిగా చేరుస్తూ, ఏసీబీ కేసును నమోదు చేయగా, తనకు కేసుతో ఎలాంటి సంబంధమూ లేదని, రాజకీయ కారణాలతోనే తనను ఇరికించారని చెబుతూ, మత్తయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించి వాదోపవాదాలను విన్న హైకోర్టు, మత్తయ్య తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించింది. ఆయనపై ఏసీబీ పెట్టిన కేసును కొట్టివేస్తున్నట్టు తెలియజేసింది.

  • Loading...

More Telugu News