: యాడికిలో వెల్లువెత్తిన మద్దతు!... మరోమారు చంద్రబాబుపై జగన్ ఫైర్!
టీడీపీ నిరసనలకు ఏమాత్రం వెనుకంజ వేయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనంతపురం జిల్లా యాడికిలో జనాభిమానం వెల్లువెత్తింది. దీంతో నిన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్... తాజాగా మరోమారు చంద్రబాబు అవినీతిపై ధ్వజమెత్తారు. చంద్రబాబుపై నిన్న జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్ర ఈ ఉదయం వరకు ప్రశ్నార్థకంగా మారింది. అయితే టీడీపీ నిరసనలతో ముందుకు వచ్చినా వెనక్కు తగ్గేది లేదన్న భావనతో జగన్ ముందడుగే వేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య యాడికిలో రోడ్ షో నిర్వహించిన జగన్ మరోమారు చంద్రబాబు అవినీతిపై ధ్వజమెత్తారు.