: ఆసుపత్రిలో బాక్సింగ్ లెజెండ్!... శ్వాసకోశ వ్యాధితో మహ్మద్ అలీ ఇబ్బంది!
బాక్సింగ్ లెజెండ్ మహ్మద్ అలీ తీవ్ర అనారోగ్యంతో కాలిఫోర్నియాలోని ఆసుపత్రిలో చేరారు. మూడుసార్లు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ గా నిలిచిన మహ్మద్ అలీ 1981లో ఆ క్రీడకు గుబ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పార్కిన్సన్ వ్యాధికి గురైన మహ్మద్ అలీ ఇప్పటికే పలుమార్లు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. నిన్న శ్వాస తీసుకునే విషయంలో ఇబ్బందులు ఎదురుకావడంతో ఆయనను కుటుంబ సభ్యులు కాలిఫోర్నియాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. మహ్మద్ అలీ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన వైద్యులు కొంతకాలం పాటు ఆయన ఆసుపత్రిలోనే ఉండక తప్పదని చెప్పారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది.