: ఎన్ఎస్జీ సభ్యత్వం కోసం భారత్ దరఖాస్తు!... స్వయంగా రంగంలోకి దిగిన మోదీ!


అణ్వస్త్రాల సరఫరాదారుల సమాఖ్య (ఎన్ఎస్జీ)లో సభ్యత్వం కోసం భారత్ దరఖాస్తు చేసింది. గత నెల 12నే లాంఛనంగా దరఖాస్తు చేసిన భారత్... సభ్యత్వం దక్కించుకునేందుకు కార్యరంగంలోకి దిగింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. ఎన్ఎస్జీలోని 42 దేశాల అధినేతలతో ఆయన నేరుగా చర్చలు జరుపుతున్నారు. ఈ నెల 4న అమెరికా పర్యటనకు వెళుతున్న ప్రధాని ఆలోగానే కార్యరంగాన్నంతా తనకు అనుకూలంగా మలచుకునేందుకు వ్యూహాలకు పదును పెట్టారు. ఈ నెల 9, 10 తేదీల్లో అమెరికాలో భేటీ కానున్న ఎన్ఎస్జీ సభ్య దేశాలు భారత దరఖాస్తును పరిశీలించి అనుమతి ఇవ్వాలా? వద్దా? అన్న అంశంపై కీలక నిర్ణయం తీసుకోనున్నాయి. ఈ క్రమంలో స్వయంగా రంగంలోకి దిగిన మోదీ అమెరికా బయలుదేరేలోగానే ఆయా సభ్య దేశాల మద్దతును కూడగడుతున్నారు. దీంతో ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News