: ముందుకెళ్లేందుకే జగన్ నిర్ణయం!... యాడికిలో రోడ్ షోకు బయలుదేరిన వైనం!


నిరసనలు వెల్లువెత్తినా వెనకడుగు వేసేది లేదని భావించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... రైతు భరోసా యాత్ర కొనసాగింపునకు సిద్ధమయ్యారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని చెప్పులతో కొట్టాలని తాను చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న రాత్రి యాడికిలోని పార్టీ కార్యకర్త ఇంటిలో బస చేసిన జగన్... నేటి ఉదయం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కాస్తంత డైలమాలో పడ్డ జగన్... అక్కడే తన ముఖ్య అనుచరులతో సుదీర్ఘ మంతనాలు చేశారు. చివరకు ముందుకు వెళ్లేందుకే ఆయన నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో యాడికిలో రోడ్ షో నిర్వహించేందుకు పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలికి చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలు జగన్ యాత్రను అడ్డుకుంటారన్న అనుమానాలతో పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించారు.

  • Loading...

More Telugu News