: కోరిక తీర్చనని చెప్పినందుకు ఇంటిల్లిపాదీ కలిసి హత్య!


కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో సంచలనం సృష్టించిన రాధమ్మ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తన బావ కుమారుడు కురువ నాగరాజు కోరిక తీర్చాలని వెంటబడుతూ అత్యాచారానికి ప్రయత్నిస్తే, ఆ విషయం ఇంట్లో వాళ్లకి చెబితే, అది నమ్మకపోగా చిన్న పిల్లాడిపై నిందలేస్తావా? అంటూ ఆగ్రహంతో ఇంటిల్లిపాదీ కలిసి ఆమెను దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో భర్త కురువ గంగప్ప, అత్త మామలు లింగమ్మ, ఈరన్న, బావ నర్సింహులు, ఆయన భార్య అయ్యమ్మ, వారి కొడుకు నాగరాజులు నిందితులని తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం రాధమ్మకు గంగప్పతో వివాహమైందని, అప్పటి నుంచి వేధిస్తుండేవారని చెప్పారు. గత నెల 29న రాధమ్మ నిద్రిస్తుండగా, నాగరాజు అత్యాచారానికి యత్నించాడని, ఆమె కేకలు వేయగా, చిన్న పిల్లాడిపై నిందలు వేస్తున్నావా? అని కొట్టి కిరోసిన్ పోసి సజీవదహనం చేశారని పోలీసులు తెలిపారు. కేసును దర్యాఫ్తు చేస్తున్నామని, నిందితులను రిమాండ్ చేయనున్నామని వివరించారు.

  • Loading...

More Telugu News