: ఆనం సోదరుల చేతుల్లో నెల్లూరు, ఆత్మకూరు పార్టీ బాధ్యతలు... నారాయణ సిఫార్సుకు బాబు ఓకే!


ఆత్మకూరు, నెల్లూరు నగరాల్లో తెలుగుదేశం పార్టీ బాధ్యతలను ఆనం సోదరుల చేతుల్లో పెట్టాలని మంత్రి నారాయణ చేసిన సిఫార్సుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని నారాయణను చంద్రబాబు కోరగా, నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని తాను చూసుకుంటానని, ఆత్మకూరు, నెల్లూరు నగరాలను ఆనం రామనారాయణరెడ్డి, ఆనం వివేకానందరెడ్డిలకు అప్పగించాలని నారాయణ సూచించినట్టు సమాచారం. వాస్తవానికి కాంగ్రెస్ లో ఉన్న ఆనం సోదరులను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించింది ఇందుకోసమే. అయితే, ప్రస్తుతం ఆత్మకూరు టీడీపీ ఇన్ చార్జ్ గా ఉన్న జి.కన్నబాబు మాత్రం ఆనం సోదరులకు పెత్తనం ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొదటి నుంచి పనిచేస్తున్న తమను పక్కన బెడితే, తాము పనిచేయబోమని ఆయన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇక ఈ గ్రూపుల మధ్య సర్దుబాటు చేయాల్సిన బాధ్యతను చంద్రబాబు, మంత్రి నారాయణకే అప్పగించినట్టు తెలుస్తోంది. ఒకసారి అందరినీ కలిపి కూర్చోబెట్టి మాట్లాడాలని, ఆపై ఇన్ చార్జ్ లను అధికారికంగా ప్రకటిద్దామని చంద్రబాబు తెలిపినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News