: జగన్మోహన్ రెడ్డీ, మీకు పోయే కాలం దగ్గర కొచ్చింది: పరిటాల సునీత


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి పరిటాల సునీత తీవ్రంగా మండిపడ్డారు. అనంతపురంలో ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘జగన్మోహన్ రెడ్డీ, మీకు పోయేకాలం కూడా దగ్గర కొచ్చిందన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే, మీరు జైలుకు మళ్లీ పోయి అక్కడ కూర్చోవాలి కాబట్టే, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇదే విషయాన్ని ప్రజలు కూడా అనుకుంటున్నారు. నువ్వు మాట్లాడిన మాటలు ఎంత దారుణంగా ఉన్నాయి? ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే మాటలా ఇవి? మా నాయకుడు చంద్రబాబు, మేము దరిదాపు పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాము. ఏ రోజైనా, మీ నాయనను ఆ మాటలు అన్నామా?’ అని పరిటాల సునీత మండిపడ్డారు. కాగా, చంద్రబాబు చేయించిన నవ నిర్మాణ ప్రతిజ్ఞపై అనంతపురంలో జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘నవ నిర్మాణ దీక్షా ప్రతిజ్ఞలో చంద్రబాబు చెప్పింది నిజంగా జరగాలంటే, చంద్రబాబు నాయుడుగారు ఎక్కడ కనపడితే అక్కడ చెప్పులతో కొడితేనే... అప్పుడుగానీ, చంద్రబాబునాయుడుగారు దీక్షా ప్రతిజ్ఞలో చెప్పింది జరగదు’ అంటూ జగన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News