: జయప్రదకు లైన్ క్లియర్ చేస్తోన్న రాజమండ్రి ఎంపీ!
రాంపూర్ ఎంపీ జయప్రద ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించడం ఖాయమైనట్టే! ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీకి దాదాపు దూరమైన ఆమె ఉత్తరాది రాజకీయాలకు గుడ్ బై చెప్పడం లాంఛనమేననిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అలనాటి అందాలతార బీజేపీలో చేరనుందా? కాంగ్రెస్ లో చేరనుందా? అన్న ఊహాగానాలు నిన్నటి వరకు షికారు చేశాయి. జయప్రద శుక్రవారం సోనియాను కలవడంతో ఆమె కాంగ్రెస్ లో చేరనుందని కథనాలు వచ్చాయి. దీనికితోడు రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజా వ్యాఖ్యలు ఆ విషయం నిజమే అనిపించేలా ఉన్నాయి.
నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి టిక్కెట్ ఎవరికిచ్చినా వారి గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. సోనియా నిర్ణయం శిరోధార్యమని అర్థం వచ్చేలా ఆయన మాటలు సాగాయి. ఇంతకుముందు జయప్రద రాజమండ్రి నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే!