: 2015లో ఐఎస్ఐఎస్ సంపాదన రూ.16,166 కోట్లు


ప్రపంచదేశాల్లోనే అత్యధిక ధనిక ఉగ్రవాద సంస్థగా ఎదిగిన ఐఎస్ఐఎస్ సంపాదన 2015లో ఏకంగా 2.4 బిలియన్ అమెరికా డాలర్లు(రూ. 16,166 కోట్లు)గా నమోదయ్యింది. 80 లక్షల మందికి పైగా ఈ నరమేధ ఉగ్రవాద సంస్థ చేతిలోపడి భారీ మొత్తంలో పన్నులు చెల్లిస్తుండగా, చమురు అమ్మకాల ద్వారా ఐఎస్ఐఎస్ తాజాగా సంపాదనను మరింత పెంచుకుంది. ఇక కేవలం ఇరాక్, సిరియా ప్రాంతాల వారి నుంచి వసూలు అయిన మొత్తం 2014లో 360 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2420 కోట్లు) కాగా, గతేడాది వసూళ్లు 800 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 5380 కోట్లు)కు పెరిగాయి. చమురు నిల్వలు, ఖనిజాలు, గ్యాస్ నిల్వలు, నగదు ఆస్తులు కలుపుకుని మొత్తంగా ఐఎస్ఐఎస్ ఆస్తి 2015 డిసెంబరు నాటికి 2,260 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. రష్యా వైమానిక దాడుల్లో అనేక ఆస్తులు ధ్వంసం అయినప్పటికీ, 40 శాతం భూభాగం కోల్పోయినప్పటికీ, ముడిచమురు 38 శాతం నుంచి 25 శాతానికి తగ్గినప్పటికీ, 2014తో పోల్చితే సంపద 11 శాతం పెరగడం విశేషం. అడ్డగోలుగా తమ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో పన్నులు వసూలు చేస్తోన్న ఐఎస్ఐఎస్, ఫార్మా కంపెనీలపై 35 శాతం, 10 శాతం ఆదాయపన్ను, 15 శాతం వ్యాపారపన్ను, 5 శాతం నగదు ఉపసంహరణ పన్ను వేస్తోంది. దీంతో ఈ నరమేధ ఉగ్రవాద సంస్థ పన్ను వసూళ్లు 12 శాతం నుంచి 33 శాతానికి పెరిగాయి.

  • Loading...

More Telugu News