: చైనాలో యువతికి నాలుగు కిడ్నీలు!


సాధారణంగా ఎవరికైనా రెండు కిడ్నీలు ఉంటాయి. అయితే కొంత మందిలో నాలుగు కిడ్నీలు కూడా ఉంటాయట. ఈ విషయం వారికి కూడా తెలియదని వైద్యులు చెబుతున్నారు. చైనాలో జియోలిన్ (17) అనే యువతి వెన్ను నొప్పితో బాధపడుతోంది. దీంతో ఆమె వైద్యులను సంప్రదించగా, పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు నాలుగు కిడ్నీలు ఉన్నాయని గుర్తించి ఆశ్చర్యపోయారు. రెనాల్ డూప్లెక్స్ మాన్ స్ట్రోసిటీ కారణంగా ఇలా జరుగుతుందని, ఈ వ్యాధి వున్న వారిలో 1500 మందిలో ఒకరు మరణిస్తారని, అయితే, ఇలా అదనపు కిడ్నీలు ఉన్నా వారికి ఆ విషయం జీవితాంతం తెలియదని వారు వెల్లడించారు. ఇక, ఈ అదనపు కిడ్నీలు ఏ పనీ చేయవని, వాటివల్ల అదనపు ప్రయోజనాలు ఉండవని వారు తెలిపారు. అలా అని వీటిని తొలగించడం ఏమంత సులువు కాదని వారు చెప్పారు. ఆమెకు యూరిటెరల్ రిప్లాంటేషన్ చేసి అదనపు కిడ్నీలను తొలగించినట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News