: అమ్మపాలు ఆ పిల్లాడి పాలిట విషమయ్యాయి!
అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుత్తి మండలంలోని కొజ్జెపల్లెలో వంశీ అనే మూడేళ్ల బాలుడు తల్లిపాలు తాగడం వల్ల మృతి చెందడం స్థానికుల్లో విషాదం నింపింది. చంద్రకళ అనే మహిళ పాముకాటుకు గురైంది. అప్పుడు తల్లి పక్కనే ఉన్న వంశీ ఆమె పాలు తాగాడు. అప్పటికే పాము విషం ఆమె శరీరం మొత్తం వ్యాపించడంతో పాలు విషతుల్యమయ్యాయి. ఆకలిగొన్న వంశీ పాలు తాగడంతో మృత్యువాతపడ్డాడు. దీంతో అక్కడ విషాదం నెలకొంది.