: ముస్లింల వల్ల మా ప్రశాంతత పోతోంది... వారిని రానీయకండి: వడోదర వాసులు


ముస్లింల వల్ల తమ ప్రశాంతతకు భంగం కలిగే అవకాశం ఉందని గుజరాత్ లోని వడోదర వాసులు మున్సిపాలిటీ అధికారులకు సూచించడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే... వడోదరను స్లమ్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు మున్సిపాలిటీ అధికారులు నడుంబిగించారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు స్లమ్ ఏరియాలను తొలగిస్తున్నారు. దీంతో సులేమాన్ ఏరియాలోని స్లమ్ ఏరియాలో నివాసం ఉంటున్న 300 ముస్లిం కుటుంబాలను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అక్కడ హింస చెలరేగింది. అయితే పోలీసుల సాయంతో దానిని అణచివేసి, వారిని దగ్గర్లో ప్రభుత్వం నిర్మించిన కాలనీలోకి తరలించారు. దీనిని వడోదర వాసులు వ్యతిరేకిస్తున్నారు. తమ ప్రాంతంలో ముస్లింలను ఉంచవద్దని చెబుతున్నారు. వారి వల్ల ప్రశాంతత చెడిపోతుందని వారు సూచిస్తూ మున్సిపాలిటీ అధికారులకు లేఖలు రాశారు.

  • Loading...

More Telugu News