: ముక్కోణపు టోర్నీ రూపంలో సవాలు... పరుగు తీయాలంటే చెమటోడ్చాల్సిందే: విండీస్ కోచ్
ఐపీఎల్ లో ఆడిన విండీస్ ఆటగాళ్ల ఫిట్ నెస్ పై ఆ జట్టు కోచ్ ఫిల్ సిమ్మన్స్ కు ఆందోళన పట్టుకుంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లతో జూన్ 3 నుంచి 26 మధ్య సిరీస్ ఆడనుండడంతో ఆటగాళ్లు ఫిట్ గా ఉండాలని సూచించాడు. గేల్, బ్రావో, స్యామి తదితరులు లేకుండానే సిరీస్ ఆడేందుకు వెళ్తున్న జట్టులో ఆటగాళ్లు సింగిల్ పరుగు తీయాలంటేనే చెమటోడ్చాల్సి ఉంటుందని చెబుతున్నాడు. ఈ ముక్కోణపు టోర్నీలో ఐపీఎల్ ద్వారా పునరాగమనం చేసిన సునీల్ నరైన్ రాణిస్తాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ప్రభావం తమ ఆటగాళ్లపై ఉంటుందని, అయితే పిచ్ లు పూర్తి భిన్నంగా ఉంటాయని, విండీస్ ఆటగాళ్లు ఒళ్లు దగ్గరపెట్టుకుని ఆడాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించాడు.