: కేసీఆర్ పై విరుచుకుపడ్డ దిగ్విజయ్ సింగ్!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, సీఎం కేసీఆర్ పై మాత్రం విమర్శల వర్షం కురిపించారు. ఈమేరకు దిగ్విజయ్ సింగ్ ఒక ట్వీట్ చేశారు. ఒక పక్క పేదప్రజలు చనిపోతుంటే, తెలంగాణ రాష్ట్రావతరణ ఉత్సవాల ప్రకటనల కోసం వందల కోట్ల రూపాయలను కేసీఆర్ సర్కార్ ఖర్చు చేయడం చాలా సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ రెండేళ్లలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందని ఆ ట్వీట్ లో విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు, వడదెబ్బ మరణాలు, నిరుద్యోగ సమస్య మొదలైన అంశాలతో తెలంగాణ రాష్ట్రం సతమతమవుతోందని ఇటువంటి సమయంలో ప్రకటనల కోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేయడం ఎంతవరకు సబబు? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దయ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఈ సందర్భంగా ఆమెకు కృతజ్ఞతలు చెబుతున్నానని దిగ్విజయ్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.