: మాజీ ప్రియురాలితో కలసి నటిస్తే 'అది గొప్ప విషయమే' అవుతుందంటున్న షాహిద్ కపూర్


'ఉడ్తా పంజాబ్' సినిమా ప్రమోషన్ కోసం షాహిద్ కపూర్ బిజీ బిజీగా తిరుగుతున్నాడు. జూన్ 17న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రానికి విశేష ప్రాచుర్యం తెచ్చేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలను చుట్టేస్తున్నాడు. తాజాగా ముంబైలో ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా షాహిద్ మాట్లాడుతూ, కరీనా కపూర్ ఖాన్ తో కలిసి మళ్లీ నటిస్తానని భావించడం లేదని అన్నాడు. ఒకవేళ అలా నటిస్తే అది గొప్ప విషయమే అవుతుందని షాహిద్ తెలిపాడు. ఆమెతో కలిసి నటిస్తారా? అని ఇప్పటి వరకు మీడియా తనను 30 సార్లు అడిగిందని, ఈ 30 సార్లు తాను 'ఎస్' అనే చెప్పానని షాహిద్ వెల్లడించాడు. 'ఉడ్తా పంజాబ్'లో తామిద్దరం నటించినప్పటికీ, తాము కలిసి నటించే సన్నివేశాలు మాత్రం ఉండవని షాహిద్ తెలిపాడు. కాగా, వీరిద్దరూ ప్రేమలో ఉండగా విడుదలైన 'చుప్ చుప్ కే', 'జబ్ వి మెట్' సినిమాల్లో వీరి కెమిస్ట్రీ అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News