: పాల ధరను పెంచిన అమూల్


పెరిగిన ఉత్పత్తి వ్యయం, రవాణా చార్జీల భారం నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీ రీజియన్లో అర లీటరు పాల ప్యాకెట్ పై ఒక రూపాయి ధర పెంచుతున్నట్టు దేశంలోనే అతిపెద్ద పాల బ్రాండ్ అమూల్ ప్రకటించింది. ఈ మార్పు శుక్రవారం నుంచి అమలవుతుందని తెలిపింది. గడచిన రెండేళ్లలో పాల ఉత్పత్తి ఖర్చు 20 శాతం వరకూ పెరిగినా, తాము ధరలు పెంచలేదని అమూల్ ఎండీ ఆర్ఎస్ సోధీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అర లీటరు ప్యాకెట్, ఒక లీటర్ ప్యాకెట్ పై ఈ పెంపుదల అమలవుతుందని, టోన్డ్, డబుల్ టోన్డ్ పాలకు వర్తిస్తుందని వివరించారు. కాగా, ఢిల్లీ పరిధిలో రోజుకు 30 లక్షల లీటర్ల పాలను అమూల్ విక్రయిస్తుండటంతో, పెంచిన ధరల కారణంగా నెలకు రూ. 9 కోట్ల వరకూ లాభాలను అందుకోనుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

  • Loading...

More Telugu News