: 'దొంగను పట్టుకోండి' అన్న మాట వినపడగానే సివంగిలా దూకిన యువతి!


ఓ దొంగను పట్టుకునేందుకు ఢిల్లీకి చెందిన ప్రియాంక (18) అనే యువతి చేసిన సాహసాన్ని ఇప్పుడందరూ మెచ్చుకుంటున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, పాండవ్ నగర్ లోని తన బంధువుల ఇంటి ముందు ప్రియాంక కూర్చుని ఉండగా, ఎదురు ఇంట్లో నుంచి 'దొంగను పట్టుకోండి' అన్న కేకలు వినిపించాయి. ఆ వెంటనే ఆమె, అతన్ని పట్టుకోవడానికి ముందుకు దూకింది. కరాటేలో బ్లాక్ బెల్ట్ పొంది ఉండటం, పోలీసుగా చేరాలన్న తన కలను నెరవేర్చుకునేందుకు నిత్యమూ ఎక్సర్ సైజులు చేస్తుండటం ఆమెకు కలిసి వచ్చింది. దొంగ మెడను ప్రియాంక గట్టిగా పట్టుకోగా, అతను బ్లేడుతో గాయపరిచాడు. అయినా, ధైర్యంగా, పట్టు విడవక, అతనిని మరింతగా బిగించింది. ఈలోగా స్థానికులు వచ్చి, దొంగకు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె సాహసాన్ని స్థానికులు మెచ్చుకోగా, ఇటువంటి వారు డిపార్టుమెంట్ లో చేరితే బాగుంటుందని పోలీసులే వ్యాఖ్యానించడం విశేషం.

  • Loading...

More Telugu News