: యూపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె: 16 మంది రోగుల మృతి
జూనియర్ డాక్టర్ల సమ్మెతో ఉత్తరప్రదేశ్‌లో 16మంది రోగులు మృతి చెందారు. అక్కడి కింగ్ జార్జ్ వైద్య విశ్వవిద్యాలయంలో జూనియర్ డాక్టర్లు పీజీ అడ్మిషన్ ప్రక్రియలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా మూడు రోజులుగా ధర్నాను కొనసాగిస్తున్నారు. దీంతో వైద్యం అందక రోగులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు 16 మంది రోగులు వైద్యం అందక మృతి చెందారు. దాదాపు 2000మంది రోగులు తమకి వైద్యం అందక వెనుదిరిగి వెళ్లిపోయారు. సీనియర్ డాక్టర్లు అత్యవసర వైద్య సేవలు మాత్రమే అందిస్తున్నారు. రాష్ట్రం నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మెరిట్ లిస్ట్ను సవరిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం పలువురు అభ్యర్థులు పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు పొందలేకపోతున్నారు. దీంతో ఆందోళనకు దిగారు.