: దసరా లోపు కొత్త జిల్లాలు: కేసీఆర్ ప్రకటన


తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ఖాయమైపోయింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సికింద్రాబాదు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో పాలుపంచుకున్న సందర్భంగా తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజలనుద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. సాధించిన విజయాలతో పాటు సాధించాల్సిన లక్ష్యాలను ప్రస్తావిస్తూ సాగిన ఆయన ప్రసంగం తెలంగాణ ప్రజల్లో కొత్త జోష్ ను నింపిందనే చెప్పాలి. పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో 14 లేదా 15 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించామని కేసీఆర్ ప్రకటించారు. దసరాలోపే కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తవుతుందని కూడా ఆయన చెప్పారు. కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News