: అభివృద్ధిలో ఉన్నత శిఖరాలు చేరాలని ఆశిస్తూ...!: కేసీఆర్ కు మోదీ గ్రీటింగ్స్!


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి నేటితో రెండేళ్లు పూర్తవుతోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో ఆవిర్భావ శోభ సంతరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నేటి ఉదయం సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు శుభాకాంక్షలు అందాయి. ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన శుభ సందర్భాన్ని పురష్కరించుకుని మీకివే మా శుభాకాంక్షలు’ అని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో గ్రీటింగ్స్ సందేశాన్ని పోస్ట్ చేశారు. అంతేకాక అభివృద్ధిలో తెలంగాణ ఉన్నత శిఖరాలను చేరుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు మోదీ సదరు పోస్ట్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News