: బెజవాడలో నవనిర్మాణ దీక్ష!... ప్రజలతో ప్రతిజ్ఞ చేయించనున్న చంద్రబాబు!
కొత్త రాష్ట్రం తెలంగాణలో ఆవిర్భావ వేడుకలకు రంగం సిద్ధమవగా... తెలంగాణ ఏర్పాటుతో తీవ్ర ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న ఏపీ నవ నిర్మాణ దీక్షకు శ్రీకారం చుట్టనుంది. నేటి ఉదయం సరిగ్గా 11 గంటలకు నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలోని బెంజి సర్కిల్ లో నవ నిర్మాణ దీక్షలకు తొలి అడుగు పడనుంది. దీక్షల ప్రారంభం సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించనున్నారు. నేడు విజయవాడలో ప్రారంభమయ్యే దీక్షలు ఈ నెల 8న ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో జరగనున్న ‘మహా సంకల్ప సభ’తో ముగుస్తాయి. ఈ ఏడు రోజుల పాటు నవ నిర్మాణ దీక్షల్లో ప్రతి రోజూ ప్రత్యేక కార్యక్రమాలకు ప్రభుత్వం రూపకల్పన చేసింది.