: నేను ఇంకా చావలేదు...బతికే ఉన్నాను: తమిళ సీనియర్ కమెడియన్ సెంథిల్
రజనీకాంత్ 'నరసింహ' సినిమాలో ఆయనతో పాటు నటించిన సెంథిల్ చెన్నై పోలీసులను ఆశ్రయించారు. గత కొంత కాలంగా తాను మరణించానంటూ వాట్స్ యాప్, సోషల్ మీడియాల్లో ప్రచారం అవుతోందని, ఆ వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. కొంతమంది కోరుకుంటున్నట్టు తానింకా మరణించలేదని, బతికే ఉన్నానని, ఇలా చెప్పుకోవాల్సిన దుస్థితి కల్పించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, తమిళనాట సీనియర్ కమేడియన్ గా ఆయన సుదీర్ఘ కాలం అభిమానులను అలరించారు. 'జెంటిల్ మెన్', 'బాయ్స్', 'నరసింహ' వంటి సినిమాలతో తమిళ, తెలుగునాట ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు.