: మీడియా ప్రతినిధులపై దాడి.. కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ అనుచిత వ్యాఖ్యలు
మెదక్ జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో ప్రాజెక్టుల విషయంలో భూములు కోల్పోతున్న గ్రామస్తులు ఈరోజు చేపట్టిన ఆందోళనలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆందోళన సందర్భంగా అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయారు. మీడియా ప్రతినిధులపై మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీ అంతుచూస్తామంటూ హెచ్చరించారు. అనంతరం కాంగ్రెస్ నేతల ఆదేశాలతో మీడియాపై ఆందోళనకారులు దాడికి దిగారు. కెమెరామెన్, రిపోర్టర్లను చితకబాదారు. మీడియా ప్రతినిధులు అమ్ముడుపోతున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు.